Srinivas Goud on Olympic day run : క్రీడా సంస్కృతిని ప్రోత్సహించేందుకే 'ఒలంపిక్ డే రన్'
🎬 Watch Now: Feature Video
Olympic day run in Hyderabad : తెలంగాణలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఇవాళ ఒలంపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఒలంపిక్ డేను పురస్కరించుకొని..తెలంగాణ స్పోర్ట్స్‌అథారిటీ, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ సంయుక్తంగా.... ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రన్‌లో 15 సెంటర్ల నుంచి... 10వేల మందికి పైగా క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. నగరంలోని 15 ప్రముఖ సెంటర్ల నుంచి... ఎల్బీ స్టేడియం వరకు ఒలంపిక్ రన్ కొనసాగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, ఒలంపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్, కో కన్వీనర్ మహేశ్వర్, మల్లారెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవలతో కలిసి ఒలంపిక్ డే రన్ కు సంబంధించిన టీషర్ట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలు క్రీడాకారులకు ఎంతో ప్రేరణగా నిలిచాయన్నారు.