తెలంగాణలో మొదటిసారిగా ఎన్నారై ఆన్లైన్ నామినేషన్
🎬 Watch Now: Feature Video
Independent Candidate From Kodad Online Nomination : అమెరికాలో ఉన్న ఓ ఎన్నారై ఆన్లైన్ ద్వారా స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన జలగం సుధీర్ అమెరికాలో ఉంటున్నారు. కోదాడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన జలగం సుధీర్, టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు. రాజకీయల పట్ల తనకు ఉన్న ఆసక్తితో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడని తెలిపారు. కొన్ని కారణాలవల్ల అమెరికా వెళ్లడంతో నామినేషన్ దాఖలు చేయడం కష్టమని భావించాడు. కానీ మొదటిసారి తెలంగాణలో ఆన్లైన్ విధానంలో నామినేషన్ ప్రక్రియ ఉండడంతో, కోదాడ రిటర్నింగ్ అధికారికి అంతర్జాలం ద్వారా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాగా అందరికి సులువుగా ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ నామినేషన్ వేయడానికి వివిధ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. తాజాగా ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన ఆన్లైన్ నామినేషన్ ద్వారా కూడా అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఆన్లైన్ నామినేషన్ విధానం లేదు. ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేయడం చాలా సులువుగా ఉందని సుధీర్ అన్నారు.