Nizamabad MP Aravind Fires On KCR : కాంగ్రెస్ నాయకులకు ఫండింగ్ చేస్తుంది కేసీఆర్: ఎంపీ అర్వింద్ - కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ విమర్శలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19681299-thumbnail-16x9-mp-aravind-pm-pb.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 4, 2023, 7:50 PM IST
Nizamabad MP Aravind Fires On KCR : తొలిసారిగా ఎంపీగా రైతుల దశాబ్దాల కళ నెరవేర్చినందుకు ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు బోర్డు ప్రకటనను బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎంపీ ఆరోపించారు. గత 15రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించటంలేదని.. సీఎం హెల్త్ బులిటెన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశారు. మోదీ, కేసీఆర్ మాట్లాడుకున్నవి కేటీఆర్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రోజు రోజుకు మునిగిపోతుందన్నారు. ప్రధానమంత్రి వస్తున్నారంటే సీఎంకు కన్ను, పంటినొప్పి, జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించిన ఆయన... బీఆర్‌ఎస్ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఈ విషయంలోనే తెలుస్తుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్పిస్తుంది కేసీఆరేనని అన్నారు.