కొత్త పార్లమెంట్​ డిజైన్​లో 1120 కిలోల కేక్​- చంద్రయాన్​-3, క్లాక్ టవర్ కూడా, ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ షో! - కొత్త పార్లమెంట్​ భవనం ఆకారంలో భారీ కేక్​ తయారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 12:16 PM IST

Updated : Dec 19, 2023, 12:36 PM IST

New Parliament Building Cake In Bangalore : కర్ణాటక బెంగళూరులోని సెయింట్​ జోసెఫ్​ స్కూల్​ ఆవరణలో ప్రపంచంలోనే అతిపెద్ద కేక్​ షోను నిర్వహిస్తున్నారు సీ.రామచంద్రన్​ అనే డెయిరీ ఫార్మ్​ యజమాని. డిసెంబర్​ 15న ప్రారంభమైన ఈ ప్రదర్శనలో నూతన పార్లమెంట్​ భవనం ఆకారంలో తయారు చేసిన 1120 కిలోల భారీ కేక్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని తయారు చేయటానికి రెండున్నర నెలల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని పొడవు 14 అడుగులు, వెడల్పు 9 అడుగులు ఉందని తెలిపారు. దీంతో పాటు చంద్రుడిపై కాలు మోపేందుకు ఇస్రో లాంఛ్​ చేసిన చంద్రయాన్​-3 మిషన్​ డిజైన్​లోనూ ఓ భారీ కేక్​ను తయారు చేశారు.

కర్ణాటకలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం 'శక్తి' థీమ్​లో కూడా కేక్​ను రూపొందించారు. ఇదే కాకుండా క్లాక్​ టవర్​, ఛత్రపతి శివాజీ, చర్చీ సహా వివిధ రూపాల్లో రంగురంగుల కేక్​లను తయారు చేయించారు నిర్వాహకులు. మొత్తం 23 రకాల్లో 6,062 కిలోల కేక్​లను ప్రదర్శనలో ఉంచారు. వీటిని చూసిన సందర్శకులు నిర్వాహకుల పనితీరును ప్రశంసిస్తున్నారు. కాగా, క్రిస్మస్​, న్యూ ఇయర్​ సందర్భంగా ఈ కేక్​ షోను జనవరి 1వరకు నిర్వహించనున్నారు.

Last Updated : Dec 19, 2023, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.