ఫ్యాక్టరీ మేనేజర్‌పై పొరుగింటి వ్యక్తి కాల్పులు- ఆ గొడవ వల్లే! - sambhal firing news today
🎬 Watch Now: Feature Video


Published : Dec 9, 2023, 2:05 PM IST
Neighbour Shot With Gun On Factory Manager : ఓ ఫ్యాక్టరీ మేనేజర్‌పై తుపాకీతో కాల్పులకు దిగాడు పొరుగింటి వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ సంభల్‌లోని బిసౌలి గేట్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఇంటికి వెళ్తున్న మేనేజర్ హరిఓం శర్మను మధ్యలో ఆపి కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు అతడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనలో మేనేజర్ శరీరంలో పలు బుల్లెట్లు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. "హరి ఓం శర్మకు నాలుగు రోజుల క్రితం పక్కింటి వ్యక్తితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అతడు కాల్పులు జరిపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడు విష్ణు అగర్వాల్‌ను పట్టుకుంటాం" అని పోలీసులు తెలిపారు.