Navaratri Celebrations in Telangana : ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. దుర్గామాత అలంకరణలో భద్రకాళీ అమ్మవారి దర్శనం - Navaratri Celebrations in badradrachalam temple
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 2:00 PM IST
Navaratri Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దుర్గామాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహ వాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అటు భద్రాద్రి రామయ్య సన్నిధిలో.. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
Dussehra Festival Celebrations in Telangana : ఈ ఉత్సవాల్లో ఏడో రోజు అయిన నేడు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ఐశ్వర్య లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యాబుద్ధులతో పాటు సకల సంపదలు చేకూరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం మహిళల చేత సామూహిక కుంకుమార్చనలు, అనంతరం దర్బారు సేవ తిరువీధి సేవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.