R Krishnaiah Fires on BRS Govt : 'రూ.1 లక్ష సాయం.. బీసీ కులాలన్నింటికీ వర్తింపజేయాలి' - BC financial assistance one lakh rupees

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2023, 5:17 PM IST

R Krishnaiah on 1 Lakh Scheme to BC in Telangana : బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని.. మోసం చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీసీలను మభ్యపెట్టారన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీబంధు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం కేవలం కొన్ని కులాల వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేలా అనుమతించారన్నారు. తక్షణమే ప్రభుత్వం బీసీలో ఉన్న అన్ని కులాలకు వర్తించేలా నోటిఫికేషన్​ జారీ చేయాలని డిమాండ్​ చేశారు. 

దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే దరఖాస్తు తేదీని 20 రోజులకు పొడిగించాలని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ అవినీతిశాఖగా మారిపోయిందన్న ఆయన.. దళారులను పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైఖరి మార్చుకోకపోతే అధికారులకు బుద్ధి చెబుతామన్నారు. బీసీ విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాలకు ఆన్​లైన్​ విధానాన్ని తొలగించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పెరిగిన మెస్ ఛార్జీలు తక్షణమే అమలు చేయాలని.. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.