Narlapur Pump House Wet Run Trial Success : నార్లాపూర్ పంప్‌హౌస్ మొదటి పంపు వెట్‌రన్ ట్రయల్ విజయవంతం - పాలమూరు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 11:04 AM IST
Narlapur Pump House Wet Run Trial Success : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా.. నార్లాపూర్ పంప్‌హౌస్‌లో మొదటి పంప్ వెట్‌రన్ ట్రయల్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటల 48 నిమిషాలకు ఈ ట్రయల్ రన్ చేపట్టారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి.. అధికారికంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించనున్నారు.
Palamuru Rangareddy Project Inauguration Today : వెట్ రన్ మొదలుపెట్టగానే.. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సర్జిపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు, మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్‌ను దాటుకొని డెలివరీ సిస్టర్న్కి విజయవంతంగా చేరాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సన్నాహక పరీక్ష పూర్తికావడంతో.. ఇంజినీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి , నాగర్ కర్నూల్ నీటి పారుదలశాఖ సీఈ హమీద్ ఖాన్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. మరోవైపు ఇవాళ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.