Narcotics Bureau SP Sunitha Reddy Interview : 'మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నిందితుల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు' - Drug trafficking in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 3:56 PM IST
Narcotics Bureau SP Sunitha Reddy Interview : హైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో 18 మందిని విచారిస్తామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు సైతం ఇందులో ఉన్నారని దర్యాప్తులో వెళ్లడైందన్నారు. త్వరలో నిందితులను కస్టడీకి తీసుకుంటే.. మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.
Madhapur Rave Party Drugs Case Updates : ఇదిలా ఉండగా.. ఏపీలోని విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నేడు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 208 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు.. చేపట్టనున్న ప్రణాళికలు, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాల నిర్వహణ మొదలగు వాటిపై.. రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..