Narcotic SP Sunitha on Madhapur Drugs Case : 'నవదీప్ ఫోన్ డేటా డిలీట్ చేశాడు.. రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తాం' - SP sunitha Reaction on Navdeep Investigation
🎬 Watch Now: Feature Video


Published : Sep 23, 2023, 8:59 PM IST
SP Sunitha on Madhapur Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇవాళ సినీనటుడు నవదీప్‌ని విచారించామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాడని వెల్లడించారు. ఈ కేసులో 81 లింక్‌లు గుర్తించారని అన్నారు. అందులో 41 లింకులపై ఉన్న వివరాలను తెలిపాడని వివరించారు. అతను డ్రగ్స్ వాడకం గురించి అడిగితే.. గతంలో వినియోగించారని.. సిట్, ఈడీ విచారణలో చెప్పిన విషయాన్ని చెప్పారన్నారు. ప్రస్తుతం మాత్రం డ్రగ్స్ వాడలేదని సమాధానమిచ్చాడని అన్నారు.
Navdeep Investigation in Madhapur Drugs Case : నవదీప్‌కి, రామ్చంద్కి సంబంధం ఏమిటని ఆరా తీశామని వెల్లడించారు. దానికి సమాధానంగా నవదీప్(Navdeep) గతంలో వారు కలిసి బీపీఎం పబ్ నిర్వహించారన్నారు. తన ఫోన్ తీసుకుని పరిశీలించారని తెలిపారు. తన మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో అతని ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని స్పష్టం చేశారు.