Yadadri Jayanti Utsavalu: యాదాద్రిలో అంగరంగ వైభవంగా జయంత్యుత్సవాలు - యాదాద్రి లక్షీనరసింహా స్వామి జయంతి ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Jayanti Utsavalu in Yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో నృసింహ జయంతి ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిత్య మూలమంత్ర హవనములు, కాళీయమర్దన అలంకార సేవ, లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అలంకార సేవపై స్వామి, అమ్మవార్లను ఆలయ తిరుమాఢ వీధుల్లో ఆలయ అర్చకులు ఊరేగించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు స్వామి వారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. విశ్వక్సేన ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తిరు వేంకటపతి అలంకార సేవోత్సవాన్ని ఆలయ అర్చకులు చేశారు. మూడో రోజు వివిధ క్రతువులను నిర్వహించనున్నారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.