Nara Bhuvaneswari Visit Chittoor District: లోకేశ్ యువగళానికి దేవుడు, ప్రజలు సహకరిస్తున్నారు.: నారా భువనేశ్వరి - Bhubaneswari opened Heritage Parlour Tirupati NH
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 1:20 PM IST
Nara Bhuvaneswari Visit Chittoor district : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. తిరుపతి - చిత్తూరు జాతీయ రహదారిలో కాశి పెంట్ల సమీపంలో గోకుల్ హెరిటేజ్ రెండవ పార్లర్‌ని భువనేశ్వరి ప్రారంభించారు. పార్లర్లోని తిరుబండారులను పరిశీలించారు. అనంతరం ఉద్యుగులు, గ్రామస్థులతో మాట్లాడిన ఆమె హెరిటేజ్ పార్లర్ అభివృద్ధికి రైతుల సహకారం కూడా ఉందని అన్నారు.
హైవేలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందించడం తమ ముఖ్య ఉద్దేశమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం ఉద్యోగస్థులతో కలిసి హెరిటేజ్ పార్లర్ ఆవరణలో మొక్కలు నాటారు. కాశి పెంట్ల గ్రామంలోని ఓ వ్యక్తికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న భువనేశ్వరి.. వారికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదును సహాయం చేశారు.
యువగళానికి సంఘీభావం : నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు దేవుడు ప్రజలు సహకరిస్తున్నారని తెలిపిన ఆమె.. ప్రజలు స్వేచ్ఛాయుతంగా మాట్లాడలేకపోతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను దెబ్బతీస్తున్నారని, ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..అందుకే లోకేశ్ పాదయాత్ర చేపట్టారని ఆమె తెలిపారు. రేపు 200 రోజు పాదయాత్ర చేరుకోనున్న సందర్భంగా తమ కుటుంబ సభ్యులు వెళ్లి లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలుపుతున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు.
ఇంటి నిర్మాణం పరిశీలన : కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న సొంత ఇంటి నిర్మాణ పనుల పురోగతిని భువనేశ్వరి పరిశీలించారు. ఇంజినీర్లు, స్థానిక టీడీపీ నేతలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరు నెలల్లోపు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.