Nara Bhuvaneswari Hunger Strike On oct 2: అక్టోబరు 2న భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష... - టీడీపీ వర్సెస్స్ వైసీపీ
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 9:56 PM IST
Nara Bhuvaneswari Hunger Strike On oct 2: అక్టోబరు రెండో తేదీన భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు లైట్లు ఆపి నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ మెుదలుకొని ఇప్పటివరకూ... ఆయన మీద అభిమానంతో 97 మంది మృతి చెందారని.. అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆయన కోసం మృతి చెందిన కుటుంబాలను త్వరలో చంద్రబాబు కలిసి సంఘీభావం తెలుపనున్నట్లు అచ్చెన్న తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అధినేత అరేస్ట్ అక్రమం అంటూ ఆగిన గుండెల కుటుంబాలకు గుండెధైర్యం నింపెదుకు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనసేనతో కలిసి జేఏసీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని అచ్చెన్న తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ చేపట్టనున్న వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.