Nagula Panchami Telangana 2023 : వైభవంగా నాగుల పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు - నాగుల పంచమి ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Nagula Panchami Telangana 2023 : శ్రావణమాస మొదటి సోమవారంతో పాటు నాగపంచమి తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి, కోరుట్లలో నాగదేవత ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా పలు శివాలయాలు భక్తులతో కితకిటలాడాయి.
Nagula Panchami Specialty : భక్తుల కొంగు బంగారం.. కోరి కొలిచిన వారికి కోరిన వరాలు ఇచ్చే కోటి పడగల సంతాన నాగదేవతకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రావణ సోమవారం రోజున నాగుల పంచమి సందర్భంగా భక్తులు ఓవైపు నాగదేవతకు.. మరోవైపు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని గాడిచర్లపల్లి వద్ద కొలువుదీరిన కోటి పడగల సంతాన నాగదేవత కు ప్రతి ఏటా ఆలయంలో శ్రావణమాసం నాగుల పంచమి సందర్భంగా 'నాగమ్మ జాతర'ను ఘనంగా నిర్వహించడం అనవాయతీగా వస్తుంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో పుట్టలో పాలు పోశారు.సుబ్రమణ్యస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.