ఈ ఎన్నికలు డబ్బులకు న్యాయానికి మధ్య జరిగిన పోరాటం - అంతిమంగా న్యాయం గెలవబోతుంది : మైనంపల్లి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2023/640-480-20166899-thumbnail-16x9-mynampally-on-ts-results.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 2, 2023, 4:04 PM IST
Mynampally on Telangana Assembly Results 2023 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యత పేదలకే ఇస్తామన్నారు. హస్తం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో 70కి పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మైనంపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్లో డబ్బుల రాజకీయాలు లేకుండా ఉండాలని లక్ష్మీ నరసింహ స్వామిని కోరుకున్నానన్నారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు డబ్బులకు న్యాయానికి మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించారు. పోరాటంలో అంతిమంగా న్యాయం గెలవబోతుందన్నారు. డబ్బుల రాజకీయం పోయి పేదలు కూడా రాజకీయాల్లో ఎదగాలని కోరుకున్నట్లు తెలిపారు.