మూడు రంగుల జెండా పట్టి సాంగ్ గుర్తుందా - ఆ బాధలో నుంచే ఈ పాట పుట్టిందట
🎬 Watch Now: Feature Video
Music Director Charan Arjun Interview : కాంగ్రెస్ వర్గాలు రేవంత్ రెడ్డిని తమవాడు అనుకోవడం లేదనే బాధలో నుంచే మూడు రంగుల జెండా పాట పుట్టిందని ఆ పాట సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు. రేవంత్ రెడ్డిని పార్టీ వర్గాలు, ప్రజలు ఆదరించాలనే లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాత్రే ఆ ఆలోచన వచ్చిందన్నారు. రెండేళ్ల కిందట స్వర కల్పన చేసిన ఆ పాటకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశేష ఆదరణ లభించడం తనకు వంద సినిమాలకు దక్కిన విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Rahul , Priyanka Gandhi Praising Charan Arjun Song : స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ పాటను ప్రశంసించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న తాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహం వల్లే సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నట్లు చరణ్ అర్జున్ వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనలో కవులు, కళాకారులకు మంచి రోజులొచ్చాయంటోన్న చరణ్ అర్జున్తో ప్రత్యేక ముఖాముఖి.