Mukesh Ambani At Dwarkadhish Temple : కృష్ణుని సేవలో ముకేశ్​ ఫ్యామిలీ.. కన్నయ్య పాదాలకు ప్రత్యేక పూజలు చేసి.. - కృష్ణుని సేవలో ముకేశ్​ ఫ్యామిలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 12:39 PM IST

Mukesh Ambani At Dwarkadhish Temple : ప్రముఖ వ్యాపార సంస్థ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ కుటుంబ సభ్యులు.. శ్రీ కృష్ణుని సేవలో తరించారు. గుజరాత్​లోని దేవ్​భూమి ద్వారకా జిల్లాలో ఉన్న ద్వారకాధీశుని ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. చిన్న కుమారుడు అనంత్​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ ఆలయానికి వెళ్లారు. అనంతరం వేదమంత్రాల మధ్య ద్వారకాధీశుని పాదాలకు ప్రత్యేక అర్చన చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్​ అంబానీ, అనంత్​ అంబానీలను శాలువాతో సత్కరించారు.

కొద్ది రోజుల క్రితం.. గణపతి నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని ముంబయిలో కొలువుదీరిన సిద్ధి వినాయకుడికి ముకేశ్​ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్​ అంబానీ, కుమార్తె ఈశాతో ముకేశ్​ అంబానీ ఆలయానికి వెళ్లారు. ఈశా కవల పిల్లలు ఆదియా, కృష్ణను కూడా తమ వెంట తీసుకెళ్లారు. బొజ్జ గణపయ్య పూజ కోసం ప్రత్యేకమైన పళ్లాల్లో పండ్లు, పువ్వులను తీసుకెళ్లారు. ఏకదంతుడికి నైవేద్యంగా భారీ సైజు లడ్డూను సమర్పించారు. ఈశా కవల పిల్లలను.. స్వామి వారి పాదాల దగ్గర పెట్టి ఆశ్వీరాదాలు ఇప్పించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.