అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం : లక్ష్మణ్ - లక్ష్మణ్ అక్షింతలు పంచారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 4:43 PM IST

MP Laxman on Ayodhya Ram Mandir Inauguration : 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌లో ఇంటింటికీ వెళ్లి అయోధ్య రామ మందిర అక్షింతలను లక్ష్మణ్ పంపిణీ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు. సనాతన ధర్మం గర్వపడేలా అందరూ ఆరోజు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాతే ప్రజలు అయోధ్యకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

MP Laxman Distribute  Ayodhya Akshinthalu : భవ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవానికి అందరూ రావాల్సిన అవసరం లేదని, అనేక సమస్యల నేపథ్యంలో ప్రజలు ప్రతిష్ఠాపన తర్వాత వెళ్లాలని లక్ష్మణ్ సూచించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైలు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను కాపాడటమే కాకుండా ప్రపంచం అయోధ్య వైపు చూస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.