తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్ - తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 4:20 PM IST
MP Laxman Fires on BRS And Congress Party : రాష్ట్రమంతా రాక్షస రాజ్యం నడుస్తోందని.. బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. ఉద్యమం పేరుతో వాడ వాడలా బీఆర్ఎస్ విస్తరించిందన్నారు. గులాబీ చీడను వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితంగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ప్రతి ఒక్కరూ వచ్చి బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తామంటున్నారని చెప్పారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రజలు ఆలోచిస్తున్నారని.. అందుకే బీఆర్ఎస్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్.. కొత్త హామీలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన గ్యారంటీలకు వారంటీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. క్రితంసారి ఎన్నికల్లో ప్రకటించిన హామీలనే బీఆర్ఎస్ ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు.