కేంద్రప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి : ధర్మపురి అర్వింద్ - వికసిత్ సంకల్ప్ యాత్ర
🎬 Watch Now: Feature Video
Published : Dec 29, 2023, 7:31 PM IST
MP Dharmapuri Arvind at Vikasith Bharath Sankalp Yatra : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లిలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. యాత్రకు హాజరైన వారికి ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. అనంతరం గోడ ప్రతులను ఎంపీ అర్వింద్ ఆవిష్కరించారు.
Vikasith Bharath Sankalp Yatra in Balkonda Nizamabad : ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను నవీకరించుకోవాలని, అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని దీంతో ప్రైవేటు అసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలన్నా ముద్ర లోన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.