ETV Bharat / state

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ - నోటీసులు జారీ - NOTICES TO BRS MLA CHANGED PARTIES

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ - బీఆర్​ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు జారీ చేసిన శాసనసభ కార్యదర్శి

Notices to BRS MLAs
Notices to BRS MLAs Who Joined Congress Party (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2025, 1:54 PM IST

Updated : Feb 4, 2025, 2:21 PM IST

Notices to BRS MLAs Who Joined Congress Party : బీఆర్ఎస్​ పార్టీలో గెలిచి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపించారు. బీఆర్​ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు పంపించారు. పార్టీ మార్పుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని కోరారు.

నోటీసులు జారీ చేసిన శాసనసభ కార్యదర్శి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్​లో గెలిచి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని స్పీకర్​కు తెలిపింది.

సుప్రీంకోర్టు స్పీకర్​కు ఆదేశాలు : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్​లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయగా, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్​ను దాఖలు చేశారు.

హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలుచేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు రాగా మేఘా అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. దీంతో దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్​కు ఆదేశాలు ఇచ్చింది.

కోర్టులో తేలేదాకా స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా? - పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఫైర్ - TG High Court On Party Defection

Last Updated : Feb 4, 2025, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.