Motkupalli About Dalit Bandhu : 'దళితబంధు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారు' - సీఎం కేసీఆర్‌పై మోత్కుపల్లి వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 3:59 PM IST
Motkupalli About KCR Dalit Bandhu : రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి నూరు శాతం అనుభవిస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) అన్నారు. దళితబంధు విషయంలో కేసీఆర్‌కు మోత్కుపల్లి సవాల్ విసిరారు. దళితబంధు నిధుల విషయంలో కేసీఆర్‌తో చర్చిద్దామంటే రెండేళ్ల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. యాదగిరిగుట్ట వద్ద పురుగులమందు తాగేందుకు కేసీఆర్ తనకు మూహుర్తం పెట్టాలని సవాల్ చేశారు.
3 లక్షల 40 వేల మందికి దళితబంధు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట తప్పారని తీవ్రంగా విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలవడని, కేసీఆర్‌కు ఓటు వేద్దామనుకుంటున్న వారంతా మనసు మార్చుకుంటున్నారని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. ఎంతో మంది చెబుతున్నా వినకుండా తాను కేసీఆర్ వెంట వెళ్లానని.. దళితబంధు వైఫల్యంతో తన వర్గానికి చెందిన వారిని ఒత్తిడికి గురిచేస్తున్నట్టు చెప్పారు. మూడెకరాల భూమి హామీతో పాటు దళితబంధు సైతం అమలుకు నోచుకోకుండా పోయిందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.