thumbnail

ఇక్కడ విద్యాబుద్ధులే కాదండోయ్ - అంతకు మించి నేర్పిస్తారు ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 7:50 PM IST

Mothers Day Program in Tiny Tots School At Kukatpally : మాతృదేవోభవ అంటూ మన పూర్వీకులు తల్లిని దైవంతో సమానంగా కీర్తించారు.. గౌరవించారు. అమ్మను మించిన దైవమున్నదా అంటూ ఆ తరువాతి కాలంలో పాటలు రాసి మాతృమూర్తిపై తమ ప్రేమను తెలియజేశారు. విలువలు మరిచిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆశ్రమాలలో చేర్చుతున్న ఈ రోజుల్లో వారిపై గౌరవాన్ని పెంచేలా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని.. పిల్లల్లో తల్లిపై గౌరవ మర్యాదలను పెంపొందించేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ పాఠశాల నిర్వాహకులు.

కేపీహెచ్‌బీలోని టైనీ టాట్స్ పాఠశాల వారు మాతృదినోత్సవం సందర్భంగా చిన్నారులతో వారి మాతృమూర్తులకు కాళ్లు కడిగించి, గంధం, పువ్వులు, కుంకుమ, పసుపులతో పూజ చేయించారు. మాతృమూర్తిని పూజించడం, గౌరవించడం ద్వారా పెద్దలతో ఎలా నడుచుకోవాలనే విషయం తెలుస్తుందని.. సంప్రదాయాలు చిన్నప్పటి నుంచే అలవడతాయని తెలిపారు. చిన్నతనం నుంచి తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు.. విలువలు నేర్పించడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే చిన్నారులకు ఇలా నేర్పిస్తే.. భవిష్యత్​లో వాళ్లు ఉత్తమ పౌరులుగా తయారవుతారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.