More Than One Lakh People Garba Dance : మోదీ పాటకు ఒకేసారి లక్షా 21వేల మంది 'గర్బా' డాన్స్.. మూడు ప్రపంచ రికార్డులు దాసోహం - గార్బా డ్యాన్స్ ప్రపంచ రికార్డులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/640-480-19884745-thumbnail-16x9--1-lakh-21-thousand-people-perform-garba-dance.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 29, 2023, 7:15 AM IST
|Updated : Oct 29, 2023, 10:36 AM IST
More Than One Lakh People Garba Dance : ప్రధాని నరేంద్ర మోదీ రాసిన గర్బా పాటకు నృత్యం చేసి.. మూడు ప్రపంచ రికార్డ్‌లు నెలకొల్పారు గుజరాతీలు. ఒకేసారి లక్ష 21 వేల మంది గోర్బా డాన్స్ చేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ రికార్డ్స్ ఆఫ్ లండన్, ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో.. శరద్ పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకకు గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వీ, మంత్రి భాను బబారియా, బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ప్రముఖ గాయకుడు పార్థివ్ గోహిల్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. రేస్ కోర్స్ గ్రౌండ్లో ఈ వేడుక జరిగింది. చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఒకేసారి మూడు ప్రపంచ రికార్డ్‌లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
TAGGED:
garba dance world records