Moosi River floods : సంగెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది.. రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
Moosi project Present Situation in Telangana : గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులతో పోలిస్తే నది ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మండలంలోని రుద్రవెల్లి-పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ జిల్లాలో తిరుగుతూ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టును కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం 08685-293312 నెంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.