Flood Water on Musarambagh Bridge : ఉప్పొంగి ప్రవహిస్తోన్న మూసీ నది.. అధికారులు అప్రమత్తం - మూసారాంబాగ్ మూసీ ప్రవాహాలు
🎬 Watch Now: Feature Video
Musarambagh Bridge Floods Video : హైదరాబాద్ మహా నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతాలు జలమయంగా మారాయి. మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ వంతెనలను తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే బ్రిడ్జి పైనుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వరద ఉద్ధృతి పెరిగితే బ్రిడ్జి పైనుంచి రాకపోకలను నిలిపి వేసే అవకాశాలున్నాయి. గడ్డి అన్నారం డివిజన్‌లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సరూర్‌నగర్ చెరువు నుంచి లోతట్టు ప్రాంతాలైన సీసలబస్తీ, కోదండరాం నగర్ కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. మూసీ నది పొంగి ప్రవహిస్తుంటే అత్తాపూర్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలు నీట మునుగుతున్నాయి. దీంతో ఆ వైపుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.