వైకుంఠ రథం వెంట వానర పరుగు..
🎬 Watch Now: Feature Video
Monkey love: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వానరం వైకుంఠ రథం వెంట పరుగెడుతూ కనిపించింది. పట్టణంలోని కొండపేటకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ స్థానికంగా బజ్జీల కొట్టు నిర్వహిస్తూ ఉండేది. నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందింది. రోజూ బజ్జీల దుకాణం దగ్గరకు వచ్చే వనరానికి(కొండముచ్చు) మిగిలిపోయిన ఆహారం అందిస్తూ ఉండేది. రోజూలాగే లక్ష్మీదేవి కొట్టు వద్దకు వెళ్లిన వానరానికి సదరు మహిళ మృతి చెంది కనిపించింది. దీంతో ఆ మహళను ఖననం కోసం శ్మశానానికి తరలిస్తుండగా వానరం కూడా వైకుంఠరథం వెంట పరుగెడుతూ అందరిని ఆశ్చర్య పరిచింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST