Monkey In Secretariat Viral Video : సచివాలయంలో 'కోతి' హైడ్రామా!.. 40 నిమిషాలపాటు అలానే.. - సచివాలయంలోకి ప్రవేశించిన కోతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/640-480-19694168-thumbnail-16x9-monkey-in-secretariat-viral-video.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 6, 2023, 8:15 AM IST
Monkey In Secretariat Viral Video : బంగాల్ రాష్ట్ర సచివాలయం (నబన్నా)లో ఓ కోతి హల్చల్ చేసింది. నబన్నాలోని 13వ అంతస్తులోకి వానరం.. గురువారం ప్రవేశించింది. అక్కడే దాదాపు 40 నిమిషాలపాటు ఉంది. వెంటనే అప్రమత్తమైన నబన్నా సెక్యూరిటీ.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సాధారణంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నబన్నాలోని 14వ అంతస్తులో సమావేశాలు నిర్వహిస్తారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆమె కాలి గాయం కారణంగా నబన్నాకు గురువారం రాలేదు. కోతి.. నబన్నాలోకి ప్రవేశించిన సమయంలో ప్రభుత్వ ముఖ్య అధికారులు మాత్రం అక్కడే ఉన్నారు. నబన్నాకు కోతి వచ్చిందని వార్త తెలియడం వల్ల సమీపంలోని కూలీలు అక్కడికి భారీగా తరలివచ్చారు. అందులో కొందరు తమ ఫోన్‌తో వానరం ఫొటోలు తీశారు. మరికొందరు బిస్కెట్లు తినిపించారు.
అంతటి పటిష్ఠ భద్రత ఉన్న నబన్నాలోకి వానరం ఎలా ప్రవేశించిందనే విషయంపై ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. సచివాలయంలోని కోతి ప్రవేశించడంపై బీజేపీ స్పందించింది. బంగాల్లో రామ రాజ్యం ఏర్పాటు కాబోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. 'రాముడి ఛరిష్మా చూడండి. బంగాల్ ముఖ్యమంత్రి జై శ్రీరామ్ అని విన్నప్పుడల్లా ఆగ్రహంతో రగిలిపోతారు. అందుకే రాముడి భక్తుడు గట్టి సందేశం ఇచ్చాడు' అని తెలిపారు.