కారులో అక్రమంగా డబ్బు తరలింపునకు యత్నం - మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతి - ఎన్నికల వేళా డబ్బు తరలింపు సిత్రాలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 5:35 PM IST
Money Being Transported in a Car Was Burnt : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో డబ్బులను అమర్చి వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి, డ్రైవర్ పరారయ్యాడు.
Illegal Money Burnt In Warangal : ఇంతలో ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని పరారయ్యారు. ఈ డబ్బు సుమారు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ ఫక్కీలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోగా.. పోలీసులు ఈ డబ్బు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు.