Moharram celebrations in Hyderabad : మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధం.. పాతబస్తీలో ట్రాఫిక్​ అంక్షలు - Hyderabad Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2023, 3:21 PM IST

Moharram celebrations in the old city : హైదరాబాద్‌లోని పాతబస్తీలో మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధమయ్యాయి. అంబారీపై బీబీ కా ఆలం ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబారీ ఊరేగింపు డబీర్​పుర నుంచి ప్రారంభమై చాదర్​ఘాట్​ వరకూ కొనసాగనుంది. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరగనుంది. అంబారీ ఊరేగింపు యాత్రలో దాదాపు 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటుగా.. టాస్క్​ఫోర్స్, క్రైమ్​టీమ్స్, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఊరేగింపు ప్రాంతాల్లో ట్రాఫిక్​ అంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ముస్లింలు హాజరై.. తమ సంప్రదాయాలు, ఆచారాలను పాటించనున్నారు. ఊరేగింపు యాత్ర డబీర్​పుర బీబీ కా ఆలం నుంచి మొదలై షేక్ ఫైజ్ కామన్, ఇత్తెబర్ చౌక్, అలిజా కోట్ల, చార్మినార్, పంజేష, మీరాలం మండి, పురాని హావేలి, దారుల్ శిఫా, కాలి ఖబర్ , చాదర్​ఘాట్ మస్జిద్ ఏ ఇలాహి వరకు కొనసాగుతుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.