ఇంటింటికి తిరుగుతూ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికల ప్రచారం - రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 5:07 PM IST
Mohammad Azharuddin in Election Campaign at Jubilee Hills : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పాార్టీ నేతలతో సైతం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ రహమత్ నగర్ డివిజన్లో పలు బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ఎంతో ఆధారాభిమానాలు లభిస్తున్నాయని సంతోశం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌడీయిజం, భూ కబ్జాదారుల ఆట కట్టిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకుంటానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా పోటీలో నిలవగా.. హైకమాండ్ అజారుద్దీన్కే టికెట్ కేటాయించింది.