thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 1:23 PM IST

Updated : Nov 14, 2023, 1:48 PM IST

ETV Bharat / Videos

ఇది నాకు కొత్త మ్యాచ్​ కాదు - జూబ్లీహిల్స్​లో ఈసారి నాదే విన్ : అజారుద్దీన్

Mohammad Azharuddin Election Campaign at Jubilee Hills : శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి తన గెలుపు ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్​ మహమ్మద్​ అజారుద్దీన్​ ధీమా వ్యక్తం చేశారు. ఇది తనకు కొత్త మ్యాచ్​ కాదని.. తాను ఇంతకు ముందు కూడా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని తనకు ఇష్టమైన క్రికెట్​ పరిభాషలోనే తెలిపారు. జూబ్లీహిల్స్​లో తనకు వస్తున్న స్పందన అత్యద్భుతంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని యూసుఫ్​గూడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

Azharuddin Election Campaign : బీఆర్​ఎస్​ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ చేయలేదని అజారుద్దీన్ విమర్శించారు. బీఆర్​ఎస్​ నాయకులు బంగారు తెలంగాణ అంటున్నారని.. వారు అంటున్నట్లుగా తెలంగాణ ఎక్కడా బంగారు తెలంగాణ కాలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్​ ధనవంతులు ఉండే ప్రాంతమని అందరూ అనుకుంటారు కానీ.. ఈ రోడ్డు పక్కన చాలా మంది పేదవారు ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టడం, పెద్ద వ్యక్తులను తీసుకురావడం కాదని.. పేద ప్రజలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే నిజమైన అభివృద్ధి అన్నారు.

Last Updated : Nov 14, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.