Models Ramp Walk in Hyderabad : జిగేల్ రాణుల ర్యాంప్ వాక్ అదరహో.. - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Models Ramp Walk at a Jewellery Showroom in Hyderabad : మతిపోగొట్టే అందం.. మైమరిపించే అభరణాల్లో అందగత్తెలు ఆకట్టుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఓ ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ సరికొత్త ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు అలియా భట్, అనిల్ కపూర్ కలిసి నటించిన "షో ద వే థీమ్" పేరుతో రూపొందించిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలను పరిచయం చేస్తూ.. నగరానికి చెందిన పలువురు మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ఆభరణాలను ధరించి మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌లో అదరహో అనిపించారు. బ్రైడ్ ఆఫ్ ఇండియా-2023 షో ద వే థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని జ్యువెల్లరీ సంస్థ ప్రతినిధి కిషన్‌రావు అన్నారు. బంగారం ధరలకు, కొనుగోలుకు సంబంధం లేదన్నారు. ఎంత ధరలు ఉన్నా వినియోగదారులు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.