కర్ణాటకలో కాంగ్రెస్​ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు : కవిత - కాంగ్రెస్​పై మండిపడ్డ కవిత

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 3:27 PM IST

MLC Kavitha Comments on BC Declaration : కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలు గోస పడుతున్నారని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిజామాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత.. నిన్న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై విమర్శలు గుప్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య.. సీఎం కేసీఆర్​ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 

Kavitha fires on Congress : కర్ణాటక రైతులకు విద్యుత్​ సరఫరా చేయకపోవడంలో కాంగ్రెస్​ విఫలమైందని.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అక్కడి రైతులు దుమ్మెత్తిపోస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఉన్న జనరల్​ నియోజకవర్గ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించకుండా.. బీసీ డిక్లరేషన్​ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రేవంత్​రెడ్డి అక్కడి స్థానాలకు టికెట్లను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు ఒక సీటు కూడా కేటాయించని కాంగ్రెస్​.. బీసీ ప్రజలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్​ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్​ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బీఆర్​ఎస్​కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.