MLC Kavitha Bathukamma Song : 'అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా'.. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా..? - ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పాట
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 12:27 PM IST
MLC Kavitha Bathukamma Song : ఈ ఏడాది సద్దుల బతుకమ్మ రోజున మహిళలు ఆడి పాడేందుకు మరో పాట వచ్చేసింది. మంచు మొగ్గలై మల్లె పొదల పూల ఏరుల్లో మన సందా మావయ్యా..! అవనిపై గౌరీదేవీ బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా..! ముసిముసి నవ్వులతో మురిసే పువ్వులు చూసి మురిసిండ్రో అంటూ సాగిన బతుకమ్మ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం.. మన తెలంగాణ ఆత్మగౌరవ సంబురం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
ఈ బతుకమ్మ పండగ కోసం స్పెషల్గా కంపోజ్ చేసిన బతుకమ్మ వీడియో సాంగ్లో ఎమ్మెల్సీ కవిత తన గాత్రంతో ఆకట్టుకున్నారు. యువతులతో కలసి గొంతు కలిపి పాట పాడారు. ఒక్కొక్క ముత్యం నేనోముకుందూ.. గౌరీ గద్దె పీట నేనోముంకుందూ.. గంధపక్షంతలు నేనోముకుందూ.. అంటూ కవిత పాట పాడారు. ఈ వీడియోలో ఆమె పాట పాడుతూ కనిపించడమే కాకుండా.. బతుకమ్మ పేరుస్తూ కూడా కనిపించారు. పచ్చని తెలంగాణ పల్లెటూరులో ఈ వీడియోను షూట్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో పుత్తడి బొమ్మల్లా తయారైన అమ్మాయిలు.. తెలంగాణ పల్లె సోయగాలు.. మరోవైపు బతుకమ్మ పూలతో ఈ వీడియో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.