MLC Kavitha attends Bathukamma celebrations in Maharashtra : మరాఠా గడ్డపై బతుకమ్మ సంబురాలు గొప్ప విషయం: ఎమ్మెల్సీ కవిత - సద్దుల బతుకమ్మ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 8:31 PM IST
MLC Kavitha attends Bathukamma celebrations in Maharashtra: తెలంగాణ సంస్కృతిని అద్దంపట్టే అపురూప వేడుక బతుకమ్మ. అటువంటి బంగారు పూల పండుగలు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సద్దుల బతుకమ్మను పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో తెలుగువారు ఘనంగా నిర్వహించారు. సోలాపుర్లో జరిగిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోటి మహిళలతో కలిసి బతుకమ్మను తలపై పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా సభాస్థలికి వెళ్లారు.
తెలంగాణ సంస్కృతిని దశదిశలు వ్యాప్తి చెందించేలా ఈ వేడుకను మరాఠా గడ్డపై నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. నవరాత్రుల సందర్భంగా జరుపుకున్న ఈ పూల పండుగలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తోటి మహిళలలతో కలిసి కవిత ఆడిపాడారు. సోలాపుర్ తూర్పు ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఇంట్లో ఈ తెలంగాణ సంస్కృతి కనిపిస్తోంది. మహారాష్ట్రలో తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు ఎమ్మెల్సీ కవిత ఇక్కడకు వచ్చారని నిర్వాహకులు తెలిపారు.