తెలంగాణ రాష్ట్రంలో 'నంబర్‌ వన్‌ 420' కేసీఆర్‌ : జీవన్‌ రెడ్డి - Telangana Assembly

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 4:37 PM IST

MLC Jeevan Reddy Press Meet at Assembly : తెలంగాణ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ 420 కేసీఆర్‌, మోసగాడు కేటీఆర్‌ అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదంటూ, కాంగ్రెస్‌ను 420 అని కేటీఆర్‌ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మొదటగా దళితులను మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం, ఇలా 'మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కేటీఆర్‌' అంటూ ధ్వజమెత్తారు.

MLC Jeevan Reddy Fires on KCR : గత తొమ్మిదేళ్లలో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా అంటూ బీఆర్‌ఎస్‌ను ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. అలాగే దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులను, దళితులను మోసం చేసిందే బీఆర్‌ఎస్‌ అని జీవన్‌ రెడ్డి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పేరు పెట్టి తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.