MLA Seethakka Fires on BRS Party : డబ్బు సంచులతో బీఆర్ఎస్ నన్ను టార్గెట్ చేస్తోంది: సీతక్క - ఎమ్మెల్యే సీతక్క బీఆర్ఎస్ పార్టీపై సంచలన వాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 29, 2023, 8:46 PM IST
|Updated : Aug 29, 2023, 9:28 PM IST
Mla Seethakka Fires on BRS Party In Mulugu : ములుగులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వమ్ముచేస్తారని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉన్నానని ప్రజల బాధలు దగ్గరికి వెళ్లి తీర్చేదానినని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలుస్తాననే భయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎండనక వాననక ప్రజల కోసం పనిచేస్తున్న తనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలలో తనపై వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ములుగు ప్రజల ఆత్మగౌరవానికి డబ్బు సంచులతో ముడి పెడుతున్నారని సీతక్క వాపోయారు. ప్రజల మధ్యనే ఉండడం తాను చేస్తున్న తప్పా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీను ఓడిస్తారని స్పష్టం చేశారు.