గుండాటలో ఎమ్మెల్యే! - రోడ్డు పక్కన జనంలో కలిసి మరీ - వైఎస్సార్​సీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 3:49 PM IST

MLA Rapaka Varaprasada Rao Playing Gundata : గుండాట, జూదం లాంటివి ఎవరైనా నిర్వహిస్తే, శాసనసభ్యుడి స్థాయిలో ఉన్నవాళ్లు అది తప్పు అని ఖండించాలి. అడుతున్నారని తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి దానిని కట్టడి చేయాలి. కానీ, జనసేన తరఫున గెలిచి వైఎస్సార్​సీపీలో చేరిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రూటే సపరేటు. ఆయనే ఏపీలోని రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం రోడ్డు పక్కనే నిలబడి, నిస్సిగ్గుగా, జంకు బొంకు లేకుండా గుండాట ఆడుతున్నారు. చుట్టు ఉన్న ప్రజలను కూడా పట్టించుకోకుంటా పందేలు వేయడంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేనే గుండాటలు ఆడితే పోలీసులు ఇంకేం చర్యలు తీసుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంక్రాంతి పండగ వేళ ఏపీలో కోడిపందేలు, గుండాట, జూదం వంటి పోటీలను జోరుగా నిర్వహిస్తున్నారు. అధికార వైసీపీ నేతల అండదండలతో పందేం బరులను, జూదం, గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతలే ఈ చర్యలకు పూనుకోవడంతో ఖాకీలు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదు. స్వయాన ఎమ్మెల్యేలే జూద క్రీడలకు దిగితే, ఆయనను చూసి ఏం నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.