MLA Rajaiah sensational Comments : 'కాలం నిర్ణయిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటా' - MLA Rajaiah sensational comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 9:07 AM IST

MLA Rajaiah sensational Comments : కాలం నిర్ణయిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను ఉంటానని..స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం వడ్డిచర్లలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాజయ్య... అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని ఆనాడే సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. అలా జరిగితే బీఫామ్ తనకే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం శ్రీహరి, ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య... కలిసిపోయారని వస్తున్న కథనాలను రాజయ్య ఖండించారు.  

MLA Rajaiah Comments On Station Ghanpur MLA Ticket : తాను స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడే నిజమవుతుందని అన్నారు.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు తాను కలిశానని, అప్పుడు టికెట్‌ తనకే వస్తుందని ఆయన చెప్పారని తెలిపారు. సీఎం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్‌ లేకపోవడంతో మళ్లీ ఆయణ్ను కలిసినట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఇస్తానని  చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కడియం శ్రీహరి, కేటీఆర్​తో కలిసి ఫోటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫొటోలు చూసి తాము కలిసిపోయామని మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.