MLA Rajaiah Comments on Kadiyam : 'ఇక నేను స్టేషన్ ఘన్పూర్కు రావాల్సిన అవసరం లేదు' - ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తాజా వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2023, 4:32 PM IST
MLA Rajaiah Comments on Kadiyam : ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 శాసనసభ స్థానాలకు.. ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలో కొన్నిచోట్ల అసమ్మతి గళాలు స్వరం పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Thatikonda Rajaiah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కేశవ నగర్ గ్రామపంచాయతీ భవనాన్ని రాజయ్య ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు.
MLA Rajaiah Sensational Comments : రాజకీయ పరిస్థితులు చూస్తే.. తాను ఇక నియోజకవర్గానికి రావాల్సిన అవసరమే లేదని రాజయ్య అన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. డప్పు కొట్టాలన్న, ఫ్లెక్సీలు కట్టాలన్న, ప్రజలు భయపడుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య.. కడియంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఎందుకు అభద్రతాభావంలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తానే సుప్రీమ్నని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు.