ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను : రాజా సింగ్ - బీజేీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 8:16 PM IST
MLA Raja Singh Refuses To Oath in Assembly : ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను బతికున్నంత వరకు ఎంఐఎం సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు. 2018లో కూడా ఇలానే ఎంఐఎం ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా నియమించారని, అప్పుడు కూడా తాను ప్రమాణస్వీకారం చేయలేదని గుర్తు చేశారు.
BJP MLA Raja Singh on MIM Party : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక మాట అడగాలని అనుకుంటున్న అంటూ మీరు కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే వెళ్లాలని అనుకుంటున్నారా అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక వాళ్ల కారు స్టీరింగ్‌ను ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టి తప్పు చేశారన్నారు. ఎంఐఎం పార్టీ వారి ముందు ప్రమాణస్వీకారం చేయాలా అంటూ, ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో వారికే స్పీకర్‌గా నియమించవచ్చు కదా ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.