MLA Raja Singh on BJP Ticket : 'నా ప్రాణం పోయినా.. బీఆర్ఎస్/ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లను' - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 29, 2023, 1:36 PM IST
MLA Raja Singh on BJP Ticket : తన ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీలకు వెళ్లనని.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలు పక్కన పెడతానని స్పష్టం చేశారు. అంతేకానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీల్లో చేరనని.. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయనని తేల్చి చెప్పారు. బీజేపీ అధిష్ఠానం తనపై సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్(Goshamahal BRS Ticket) ముస్లింల చేతిలో ఉందని.. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని అన్నారు.
BJP MLA Raja Singh on Joining BRS/Congress : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇరుకున పడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించి బీజేపీ క్రమశిక్షణ సంఘం.. గతేడాది ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అలాగే శాసనసభాపక్ష పదవి నుంచి కూడా తొలగించింది. అనంతరం అప్పటి నుంచి ఎమ్మెల్యేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తుంది.