తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యే ఉంది : రాజాసింగ్
🎬 Watch Now: Feature Video
MLA Raja Singh Interview : గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తమ ప్రచారంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే అధిక లాభాలుంటాయని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే అసలైన పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
పదేళ్లలో గోషామహాల్లో ఎంతో అభివృద్ధి చేశామని రాజా సింగ్ పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులపై చిన్న పుస్తకాన్ని విడుదల చేసి.. ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల కోసం ఇతర పార్టీలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. గోషామహాల్లో రూ.500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఆ అభివృద్ధే తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తారంటున్న రాజాసింగ్‌తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.