MLA Jaggareddy Viral Video : వచ్చే పదేళ్లలో నేనే ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు - Telangana Assembly Elections 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 24, 2023, 7:57 AM IST
MLA Jaggareddy Viral Video : వచ్చే పదేళ్లలో తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డితో పాటు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం తనపై ఉంటే.. తప్పకుడా వచ్చే పదేళ్లలో సీఎం అవుతానన్నారు. విజయ దశమి నాడు తన మనసులో మాటను అభిమానులకు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. 'సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి' అని.. ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా అని అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి తెలిపారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని గుర్తు చేశారు. తాను అందుబాటులో లేక పోయినా.. తన భార్యతో పాటు తన అనుచరులు ఉంటారని అన్నారు. తన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా.. వెంటనే అక్కడికి వాలిపోతానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలని ఆకాంక్షించారు.