Vemulawada MLA Ticket Controversy : 'వేములవాడ టికెట్ ఈసారి నాదే'.. ఆసక్తికరంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు - Karimnagar latest politics

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2023, 10:22 PM IST

MLA Chennamaneni Ramesh Babu Latest Comments : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్​ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. కరీంనగర్ జిల్లాలో కీలకమైన స్థానంగా గుర్తింపు పొందిన వేములవాడ నియోజకవర్గానికి ఈసారి డిమాండ్ పెరగడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. తనకు టికెట్ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలను సీఎం వ్యక్తి గతంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారని.. తన పేరు మాత్రం అందులో లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ గుర్తు 100 పడకల ఆసుపత్రి అంటూ పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తయారైందని ఆరోపించారు. అలా వందల కోట్లు సంపాదించుకున్న వారు వేములవాడకు వచ్చారంటూ విమర్శించారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో తనకే వేములవాడ టికెట్ వస్తుందని కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు చెన్నమనేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.