మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ - ఫౌంటేన్లా ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు
🎬 Watch Now: Feature Video
Mission Bhagiratha Water Pipeline Leak in Mancherial : మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక పరిధిలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా మంచి నీరు వృథాగా పోయింది. ఒక్కసారిగా లీకేజీ కారణంగా నీరు ఉవ్వెత్తున ఎగిసి పడింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ నీటిలో తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. రహదారిపై వరద చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలో విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.
Mission Bhagiratha Water Leak : ఈ క్రమంలో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం కొంతసేపటికి అక్కడికి చేరుకున్న పురపాలక అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. అనంతరం పైపులు లీక్ కావడానికి గల కారణాలు తెలుసుకొని మరమ్మతు పనులు ప్రారంభించి లీకేజీని అరికట్టారు. కాగా జలపాతాన్ని తలపించే నీటి దృశ్యాన్ని పలువురు సెల్ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియోలు వైరల్గా మారాయి.