Double Bed Room Houses in Hyderabad : "ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం"
🎬 Watch Now: Feature Video
Double Bed Room Houses Inaugurated by Ministers in Hyderabad : ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లను వారు ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారిని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత మంచినీరు ఇస్తున్నట్లు వివరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని వారిని గర్తించి.. వారికి ఇళ్లు కేటాయించామని, ఇళ్ల నిర్మాణంతో పాటు అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు సమకూర్చారని మంత్రి తలసాని చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇంటి ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందని.. ఎవరు అమ్ముకోవద్దని అన్నారు. మురళీధర్ బాగ్లో డబుల్ బెడ్ రూంలు నిర్మించేందుకు రూ.10 కోట్లు అయ్యాయని చెప్పారు. మొత్తం ఆ ప్రాంతంలో 120 ఇళ్లను నిర్మించారని మంత్రులు తెలియజేశారు.