సీతక్క, సీతక్క అంటూ నినాదాలు - పాఠశాల విద్యార్థులతో మంత్రి మాటామంతీ - మేడారం జాతర ఏర్పాట్ల పనులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 7:52 PM IST

Minister Seethakka Interact with Students : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన మంచి మనసును చాటుకున్నారు. విద్యార్థులతో కలిసి సందడి చేశారు. అనంతరం వారికి భవిష్యత్తు గురించి సలహాలు ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు జరగబోయే పనుల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీతక్క వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అటు వైపుగా వెళ్తున్న బస్సులో నుంచి విద్యార్థులు జై సీతక్క అని నినాదాలు చేశారు.

Seethakka Inspected Medaram Festival Activities : విద్యార్థులను గమనించిన మంత్రి సీతక్క(Minister Seethakka) వారితో కలిసి సందడి చేశారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆ బస్సులో పదో తరగతి విద్యార్థులు ఉన్నందున పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. దీంతో పాటు ఇంటర్‌లో మంచి కోర్స్‌ తీసుకుని గమ్యం వైపు ప్రయాణించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా వారికి ఇష్టమైన రంగంలో రాణించాలని సలహా ఇచ్చారు. చెడు అలవాట్లు వైపు వెళ్లకుండా చదువులోనూ, ఆటల్లోనూ ముందుండాలన్నారు. సీతక్క మాటలు ముగించిన వెంటనే సమ్మక్క సారక్క- మా అక్క సీతక్క అంటూ కేరింతలు కొడుతూ విద్యార్థులు నినాదాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.