ఓటు వేసిన ప్రజలను గెలిపించడానికే కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరాను : సబితా ఇంద్రారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 10:47 PM IST
Minister Sabitha Indra Reddy Exclusive Interview : ఓటు వేసిన ప్రజలను గెలిపించడానికే తాను కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి మారాల్సి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కోరుకునే అభివృద్ధే తన గెలుపుగా భావించానని పేర్కొన్న సబితా ఇంద్రారెడ్డి.. ఈసారి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Telangana Election Polls 2023 : ఈసారి కచ్చితంగా మూడోసారి బీఆర్‌ఎస్ గెలిచి.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తారని.. మహేశ్వరం ప్రజలు తన వెంటే ఉన్నారని అన్నారు. చేవెళ్ల గడ్డ తనకు రాజకీయ ఓనమాలు నేర్పితే మహేశ్వరం ఓటర్లు తనను నాయకురాలిగా నిలబెట్టారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి మహేశ్వరం అభివృద్ధి కోసం సహకరించారని తెలిపారు. మహేశ్వరంలో జరిగిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందంటోన్న సబితా ఇంద్రారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.